నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ శనివారం స్థానిక ఏసి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ వెనక ప్రాంతంలో పర్యటించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డులో అనధికారికంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలు, దుకాణాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను, రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా, దుకాణాలు ఏర్పాటు చేయకుండా నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.