నెల్లూరు రూరల్ 37వ డివిజన్ రాంనగర్ అంగన్వాడి సెంటర్ లో శనివారం పోషణ మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, గర్భవతులు, బాలింతలు, 0-6 ఏళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, మిద్దే శ్రీనాథ్, కో క్లస్టర్ విష్ణు ప్రియ, సూపర్వైజర్ స్వరూప, టీచర్లు భగవతి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.