నెల్లూరు: మాజీ మంత్రి కాకాణికి సుప్రీంలో చుక్కెదురు

క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పొదలకూరు పోలీసుస్టేషన్ లో ఆయనపై ఫిబ్రవరి నెలలో క్వార్ట్జ్  తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై కేసు నమోదైంది. గతంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలసిందే.

సంబంధిత పోస్ట్