శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా, నెల్లూరులోని గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు శుక్రవారం సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వివి ఓట్టూరు సురేంద్ర యాదవ్, ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ, కమిటీ సభ్యులు కోటిరెడ్డి పాల్గొన్నారు.