నెల్లూరు: కోటంరెడ్డి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, శుక్రవారం 20వ డివిజన్ ఎర్ర కోనేటి మిట్ట గిరిజన కాలనీలో టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్న, వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి శ్రీనివాసులు, కార్పొరేటర్ చేజర్ల మహేష్ లు మాట్లాడుతూ కోటంరెడ్డి అతి త్వరలోనే మంత్రి పదవి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇంచార్జ్ దారామల్లి, అన్నంగి రమణయ్య, పెరుమాళ్ళ పద్మజ యాదవ్, డిఆర్ ఇందిరా, ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్