నెల్లూరు: వక్ఫ్ బోర్డు స్థలాలపై సర్వే

ఆదివారం, నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ లో గల 13.33 ఎకరాల జామియా మసీదుకు చెందిన వక్ఫ్ స్థలాన్ని ఏపీ వక్ఫ్ బోర్డ్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు ఈ సర్వే చేపట్టారు. భూమి అలానే ఉందా లేదా ఏదైనా అన్యాక్రాంతం అయిందా అని తెలుసుకునేందుకు ఈ సర్వే జరిగినట్లు అధికారులు తెలిపారు. సర్వే అనంతరం జంగిల్ క్లియరెన్స్ చేపడతామని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్