తోటపల్లి గూడూరు మండలం, సౌత్ ఆములూరు గ్రామంలో కూటమి నేతల దాడిలో గాయపడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేముల శ్రీనివాసులును మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాసులపై టీడీపీ దాడిని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై విమర్శలు సంధిస్తూ, తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.