నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ ఆధ్వర్యంలో శనివారం నక్ష కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, నక్ష కార్యక్రమం ద్వారా నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే ప్రోగ్రాంలో వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, అడ్మిన్ కార్యదర్శులు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు సంయుక్తంగా పాల్గొనాలని సూచించారు.