శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజు, శనివారం, నెల్లూరులోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు త్రిపురభైరవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ఆలయ నిర్వహణ అధికారి గిరి కృష్ణ పాల్గొన్నారు.