ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దీపావళి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ దీపావళి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంతున్నట్లు తెలిపారు. పిల్లలు, పెద్దలు పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పిల్లలు బాణసంచాకు దూరంగా ఉండాలని కోరారు.