నల్లచెరువు మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ముదిగుబ్బకు చెందిన వరలక్ష్మి, అనారోగ్యంతో మంగళవారం బెంగళూరులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.