బత్తలపల్లిలో జరిగిన ఆన్లైన్ మోసం కేసులో ముగ్గురు నిందితులను ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు బాధితుడి మొబైల్ దొంగిలించి, ఫోన్ పే ద్వారా రూ. 1.82 లక్షలు దోచుకున్నారని చెప్పారు. నవంబర్ 5న వారిని అరెస్ట్ చేసి, రూ. 90 వేల నగదు, మోటార్సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.