హిందూపురం డీఎస్పీ మహేష్ మంగళవారం మాట్లాడుతూ, ఈనెల 4న జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోకి ఫోర్ వీలర్ వాహనాలను అనుమతించబోమని, విగ్రహాలకు విద్యుత్ వైర్లు తగలకుండా నిపుణులైన వారిని వెంట తెచ్చుకోవాలని తెలిపారు. వినాయక మండపాల కమిటీలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.