శనివారం అనంతపురం పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ట్రెజరీ కార్యాలయం కోసం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, సిబ్బంది, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.