మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, రాచూరి వెంకట కిరణ్ లపై తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ, పాపంపేట భూముల జోలికొస్తే తరిమి తరిమి కొడతామని, కబ్జా కోరులను ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేంత వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారి వెన్నులో వణుకు పుట్టించామని కూడా ఆయన అన్నారు.