మడకశిర: ప్రమాదాల నివారణకై రోడ్డు మరమ్మత్తులు

మడకశిర పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, పెనుగొండ రోడ్డులో ప్రధాన రహదారిపై పెద్దగుంతలు పడటంతో రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్డు ఇలా ఉండడం గమనించిన సీఐ రాజకుమార్ ఆదివారం మరమ్మత్తులు చేపట్టేలా చొరవ తీసుకున్నారు. పట్టణంలోని ఓ కాంట్రాక్టర్‌తో కలిసి ట్రాక్టర్ల ద్వారా జెల్లీ సిమెంట్ ను తెప్పించి గుంతలు పడిన చోట పూడ్పించారు. సీఐ చొరవను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్