చేన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఐచర్‌ను ఢీకొని బోల్తా పడిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో సురక్ష (30) అనే మహిళ మృతిచెందింది. ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు, వారికి చికిత్స అందిస్తున్నారు.