గుడిబండ: ట్రాక్టర్ కిందపడి రైతు మృతి

గుడిబండ మండలం ఎస్ఆర్ట్టి గ్రామానికి చెందిన రమేశ్ (36) శనివారం తన ట్రాక్టర్ కిందపడి మృతి చెందారు. పొలం నుంచి మొక్కజొన్న దిగుబడులు తెస్తుండగా, ఆయన మూడేళ్ల కుమారుడు లోహిత్ ఎక్సలేటర్ లాగడంతో ట్రాక్టర్ వేగంగా వెళ్లి ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో రమేశ్ చక్రాల కింద పడిపోగా, లోహిత్ చేయి విరిగింది. రమేశ్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. లోహిత్ ను తుమకూరు ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్