కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎస్వీజీఎం డీగ్రీ విద్యార్థులు సందర్శించారు. అర్థశాస్త్ర అధ్యాపకులు ఎంవీ. శేషయ్య, డా. కే. శ్రీధర్ మాట్లాడుతూ, బీఏ అర్థశాస్త్ర విద్యార్థులకు క్షేత్ర పర్యటనలో భాగంగా పాఠ్యాంశంలోని అంశాలను వివరించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత, ఉత్తమ యాజమాన్య సాగు పద్ధతులను, వ్యవసాయ క్షేత్రంలో అమలు పరిచే ఉద్దేశాన్ని వారికి తెలియజేశారు.