సీతంపేట: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు.. ఒకరి మృతి

సీతంపేట మండలంలో హడ్డుబంగి సమీపంలో ఉన్న మలుపు వద్ద గురువారం ఉదయం ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకు కూర్చున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదాన్ని గల పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్