శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం రాత్రి అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి జిల్లా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి, అముదాలవలస–పాలకొండ రహదారి నిర్మాణం, కళింగపట్నం ప్యాసింజర్ జెట్టీ నిర్మాణం వంటి మూడు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.