కార్తీక మాసం రెండో బుధవారం సందర్భంగా ఆముదాలవలసలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షలు ప్రారంభమయ్యాయి. దువ్వాడ రామా చౌదరి, హరికృష్ణ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 150 మంది అయ్యప్ప స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.