ఎచ్చెర్ల: నదీ తీరానికి కొట్టుకు వచ్చిన మృతదేహం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు పంచాయతీ కాలింగపేట సమీపంలో నాగావళి నది తీరానికి మంగళవారం ఒక యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుడిని శ్రీకాకుళం పట్టణం ముంజేటి వీధికి చెందిన బలగ సాయి (24)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సందీప్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్