నరసన్నపేట పట్టణంలో ఆదివారం బంగారు, ఇతర వ్యాపారులపై సంఘ విద్రోహ శక్తులు, లోకల్ గ్యాంగ్స్, గంజాయి బ్యాచ్ ల అరాచకాలను అరికట్టాలని వర్తక వాణిజ్య గౌరవ అధ్యక్షుడు జామి వెంకట్రావు పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. వ్యాపారం చేయాలంటే భయంతో చేస్తున్నామని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వర్తకులు పాల్గొన్నారు.