జలుమూరు: అల్లాడ ప్రభుత్వ పాఠశాలలో కట్లపాము.. తప్పిన ప్రమాదం

జలుమూరు మండలం అల్లాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం కట్లపాము కలకలం సృష్టించింది. పాఠశాల తెరిచి విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా, బెంచి కింద ఉన్న పామును చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు పామును చంపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల సెలవుల అనంతరం పాఠశాల తెరిచినట్లు ఉపాధ్యాయుడు రామచందర్రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్