జలుమూరు మండలం బసివాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ 2 ఎం వరప్రసాదరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్ఎం రాధా రమణికి సూచనలు, సలహాలు అందించి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల రికార్డులను కూడా పరిశీలించారు. ఈ తనిఖీలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.