ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం, ఆయన సేవలు ఎప్పటికీ అమరులని హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయులు మెండ రామారావు, లక్ష్మణరావు, ప్రసాదరావు కొనియాడారు. శనివారం జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైనట్లు విద్యార్థులకు తెలియజేశారు. ఆయన సేవలు ఎనలేనివని అన్నారు.