నరసన్నపేట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు మంగళవారం జరిగాయి. నిర్వాహకులు సాయి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, మండలం నుండి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 42 టీములు, 126 మంది విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 23వ తేదీన శ్రీకాకుళంలో జరిగే జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారు.