నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక కోర్ టెక్నాలజీ కేంద్రంలో ఏపీపీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుండి తొమ్మిది గంటలలోగా కేంద్రానికి చేరుకోవాలంటూ సంబంధిత అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అభ్యర్థులు సమయానికి చేరుకున్నారు. ఉదయం జరిగే పరీక్షలలో భాగంగా 149 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉందని నిర్వాహకులు తెలిపారు.