నరసన్నపేట: సత్యవరంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు అయ్యాయని ఎంపీపీ అరంగి మురళీధర్ తెలిపారు. బుధవారం ఆయన మండల ఇంజనీర్ బగ్గు నర్సింగరావుతో కలిసి పనులను పరిశీలించారు. మురుగు కాలువలు, కల్వర్టు సిమెంటు పలకల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించబడ్డాయని, పనులు రేపటి నుండి ప్రారంభమవుతాయని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్