గ్రామాలలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సిఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం నరసన్నపేట సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, చలికాలం, పండగ సమయాలలో ఇతర రాష్ట్రాల నుండి తెలుగు రానివారు రగ్గులు, బట్టలు అమ్మేందుకు తిరుగుతూ ఉంటారని, ఆ సమయంలోనే వారు ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.