వైసిపి అధిష్టానం ఆదేశాల మేరకు నియమించిన అనుబంధ విభాగాలతో నరసన్నపేట వైసిపి ఇన్చార్జి ధర్మాన కృష్ణ చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన మాట్లాడుతూ విభాగాల వారీగా అప్పగించిన ఆయా అధ్యక్షులు, సభ్యులు విధి విధానాలను పాటిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.