నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన కెల్ల రాజారావు కుటుంబ కలహాల కారణంగా మనస్తాపంతో శనివారం గడ్డి మందు తాగి మరణించారు. 26న సాయంత్రం గడ్డి మందు తాగిన రాజారావును కుటుంబ సభ్యులు నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.