ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ పాలనపై ఇంటింటా సర్వే నిర్వహించాలని తెలియజేశారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం నరసన్నపేట పట్టణంలోని నక్క వీధి, గౌడ వీధి, పసర్ వీధి లలో ఇంటింటి సర్వే నిర్వహించామని తెలియజేశారు. విద్యుత్ సమస్యలు ఉన్నాయని తన దృష్టికి తీసుకు వచ్చారని తక్షణమే పూర్తి చేస్తామన్నారు. సమస్యలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.