సారవకోట: గోడ కూలి మహిళకు తీవ్ర గాయాలు

సారవకోట మండల కేంద్రంలోని హరిజన వీధిలో బుధవారం ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా బాత్రూం గోడ కూలి ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న ఆర్ సింహాద్రమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్