మందస: 'ఎమ్మెల్యే రైతులకు అండగా ఉండాలి'

మందస మండలం రాంపురంలో శుక్రవారం కార్గో ఎయిర్ పోర్ట్ భూ బాధిత రైతుల సమావేశం నిర్వహించారు. వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రైతులు ఉద్దానంలో ఎయిర్ పోర్ట్ అవసరం లేదని, ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వబోమని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించి రైతులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్