కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రైవేటు ఆలయ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.