శనివారం పలాసలో జరిగిన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆదివారం పలాస చేరుకుని, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచించారు.