అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ ప్రారంభం: ఎమ్మెల్యే గొండు శంకర్‌

శనివారం శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలబాలికల క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రారంభించారు. ఈ నెల 3 నుంచి 8 వరకు కోడిరామూర్తి స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాల్లో 13 జిల్లాల జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. క్రీడలు శారీరక–మానసిక వికాసానికి దోహదపడతాయని, ప్రతిభావంతులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కొత్త స్టేడియం పనులు త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ ఎ.రవిబాబు, ఎస్‌జీఎఫ్‌ ప్రతినిధులు, క్రీడా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్