శ్రీకాకుళం నాగావళి నది తీరాన ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజలతో ప్రారంభించి, బాల త్రిపుర సుందరి దేవికి అర్చనలు చేశారు. నిర్వాహకులు రాత్రి జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.