రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. సోమవారం కోటబొమ్మాలి పిఎసిఎస్ అధ్యక్ష, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.