టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 10వ లైనులో ఉన్న లేడీస్ కార్నర్‌లో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులోని వస్తువులు, చీరలు అగ్నికి దగ్ధమయ్యాయి. టెక్కలి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. యజమాని దమయంతి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.