వైభవంగా సూర్యనారాయణమూర్తి ఆలయ శిఖర ప్రతిష్ఠ

సంతబొమ్మాళి మండల కేంద్రంలో శ్రీ సూర్యమారుతి సేవాసంఘం ఆధ్వర్యంలో సుమారు 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సూర్యనారాయణమూర్తి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శిఖర ధాన్య ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్