AP: కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం సంచలన ట్వీట్ చేశారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిందని, దానిని సూపర్ హిట్ అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలను పూర్తిగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.