AP: అనంతపురంలో ఈనెల 10న 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' సభను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సోమవారం పరిశీలించారు. చరిత్రలో నిలిచిపోయేలా సభ ఉంటుందని మంత్రి పయ్యావుల అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను కూటమి ప్రభుత్వం నిలుపుకుందని, సభను విజయవంతం చేయాలని మంత్రి కోరారు.