AP: బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు వైభవంగా జరగనుంది. సాహస క్రీడలు, ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్‌తో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27న సీఎం చంద్రబాబు రూ.97 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసి సూర్యలంకను జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటాలలో ప్రముఖ గమ్యస్థానంగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.