AP: బాపట్ల జిల్లాలోని సూర్యలంక తీరంలో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు బీచ్ ఫెస్టివల్ జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదా నిర్ణయంతో తదుపరి తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.