ఇవాళ స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం

AP: సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. మొత్తం 21 కేటగిరీలలో ఈ పురస్కారాలు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందజేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 6 మున్సిపాలిటీలు, 6 జీపీలకు పురస్కరాలు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు అందజేయనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాలను సత్కరించనున్నారు.

సంబంధిత పోస్ట్