తాడిపత్రిలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య గొడవ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో టీడీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. శోభాయాత్రలో జేసీ ప్రభాకర్, కాకర్ల రంగనాథ్ వర్గీయులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలో పోటాపోటీ నినాదాలతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో జేసీ, కాకర్ల వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత పోస్ట్