AP: కాకినాడ సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు, ఈ భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, అందుకు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని సూచించారు. ఈ నిర్ణయంతో ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలోని 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.